Saturday, November 23, 2024

డబుల్ బెడ్‌రూం ఇండ్ల అర్హులను గుర్తించాలి: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Review On Double Bedroom Houses

సిద్దిపేట: కెసిఆర్ నగర్‌లో డబుల్ బెడ్‌రూం పంపిణీకి మిగతా అర్హులను త్వరగా గుర్తించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో సిఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై కలెక్టర్ వెంకట్రామరెడ్డి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిద్దిపేట పట్టణంలో మహతి ఆడిటోరియం, సమీకృత మార్కెట్ నిర్మాణానికి అనువైన స్థలం సేకరణ జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సిద్దిపేట పట్టణం ప్రధాన ఆకర్షణగా ఉన్న రంగనాయక సాగర్ ను రూ. 100 కోట్లతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టును సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేయాలని మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్‌కు మంత్రి సూచించారు. టూరిజం హోటల్‌ను ఈ నెలాఖరులోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కాలకుంట, లింగారెడ్డి పల్లి, పొన్నాలలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదప్రజలకు ఇండ్లపట్టాలను సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేసేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పట్టాల పంపిణీ సమయంలోనే గృహ విద్యుత్ కనెక్షన్, నల్లా కనెక్షన్, పత్రాలను అందజేయాలని సూచించారు. కేసీఆర్ నగర్‌లో నిర్మించిన 2400 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 1690 ఇండ్లకు సంబంధించి పంపిణీ చేశామని మిగతా 7,770 ఇండ్లకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆదాయం పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, ముజామిల్‌ఖాన్, రెవెన్యూ అధికారి చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణచారి, తహసీల్దార్ విజయసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Minister Harish Rao Review On Double Bedroom Houses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News