వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌ను పదవి నుంచి తప్పుకుంటున్న ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేశారు. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థిని ప్రస్తుత ప్రభుత్వ నేత స్వయంగా కలుసుకుని శుభాకాంక్షలు అందచేయడం ఇదే మొదటిసారి. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్‌ను పదవి నుంచి వైదొలగనున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు అభినందించకపోవడం గమనార్హం. పైగా ఆయన బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను పదేపదే ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హ్యారిస్‌ను ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కలుసుకుని అభినందించడం శుభ పరిణామమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. ఈ నెల 20న బైడెన్, హ్యారిస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పెన్స్ నుంచి ఈ రకమైన స్పందన రావడం పట్ల ట్రంప్ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బైడెన్ పదవీ స్వీకార ప్రమాణానికి తాను హాజరు కానున్నట్లు పెన్స్ ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ మాత్రం ఆ కార్యక్రమానికి రావడానికి నిరాకరిస్తున్నారు.
కమలా హ్యారిస్‌ను కలుసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -