Friday, November 22, 2024

నాగోబా జాతర రద్దు

- Advertisement -
- Advertisement -

Nagoba Jatara was canceled

 

ప్రకటించిన మెస్రం వంశీయులు

మనతెలంగాణ/హైదరాబాద్ : అన్ని పండగలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడుతుంది. ప్రతి ఏటా జరిగే జాతరలు, ఉత్సవాలపై కూడా కోవిడ్ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో జరిగే నాగోబా జాతరను రద్దు చేశారు. కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి నిర్వహించే ఈ జాతరను రద్దు చేస్తున్నట్లు మెస్రం వంశీయులు ప్రకటించారు. జాతర రద్దయినా మహా పూజలను మాత్రమే నిర్వహిస్తామని వారు తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్‌లో ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు నిర్వహించే నాగోబా జాతరను రద్దు చేస్తూ మెస్రం వంశీ యులు తీర్మానించారు. ఉమ్మడి జిల్లాలోని మెస్రం వంశీయులు నాగోబా ఆలయం (మురాడి)లో సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్‌రావ్‌పటేల్, పెద్దలు చిన్నుపటేల్ తీర్మాన వివరాలు వెల్లడించారు. కొవిడ్-19 నేపథ్యంలో కేవలం మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు, కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. నాగోబాకు మెస్రం వంశీయులు నిర్వహించే మహాపూజలతో పాటు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని వారు స్పష్టం చేశారు. జాతరతోపాటు ప్రజా దర్బార్‌ను కూడా రద్దు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News