Friday, November 22, 2024

జి7 సమావేశాలకు మోడీని ఆహ్వానించిన బ్రిటన్ ప్రధాని

- Advertisement -
- Advertisement -

Boris johnson invites Modi to G7 summit

 

లండన్: జి7 దేశాల సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆహ్వానించారు. జూన్ 11నుంచి 13 వరకు జరిగే జి7 దేశాల సమావేశాలకు బ్రిటన్ నేతృత్వం వహించనున్నది. గతేడాది ఫోన్‌కాల్ ద్వారా మోడీని వ్యక్తిగతంగా ఆహ్వానించిన జాన్సన్ ఆదివారం అధికారికంగా ఆహ్వానం పంపారు. జి7లో బ్రిటన్, కెనడా,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా సభ్యదేశాలు. కాగా, భారత్‌తోపాటు దక్షిణకొరియా, ఆస్ట్రేలియాలను అతిధులుగా ఆహ్వానిస్తున్నారు. జి7 దేశాల సదస్సుకన్నా ముందే జాన్సన్ భారత్‌లో పర్యటించనున్నట్టు తెలిపారు. రిపబ్లిక్‌డేకు జాన్సన్‌ను భారత్ ముఖ్య అతిథిగా ఆహ్వానించగా, బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వల్ల రాలేకపోతున్నట్టు జాన్సన్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News