Friday, November 22, 2024

కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసిపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టిఎంసి అంశంపై దాఖలైన పిల్‌పై విచారణ మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థాన్ని న్యాయవాది రంగయ్య కోరడంతో పాటు గతంలో దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొనడంతో పాటు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించొచ్చని సూచించింది. పంప్‌లైన్ విధానం ద్వారా 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య కోరిన అత్యవసర విచారణను కోర్టు నిరాకరించి, మరోసారి అప్లికేషన్ పెట్టుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. కాగా, పంప్‌లైన్ విధానం ద్వారా నీటిని తరలిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.8 వేల కోట్ల అదనపు భారం పడుతుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. నీటి తరలింపు ప్రక్రియను పాత పద్ధతినే కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు.

ఇప్పటిదాకా 2 టిఎంసిల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నెల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారన్న పిటిషనర్ ప్రతి ఏటా ప్రభుత్వంపై వేల కోట్ల నిర్వహణ భారం పడుతుందని కోర్టుకు వివరించారు. పంప్‌లైన్ పద్ధతి ద్వారా నీటిని తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయని పిటిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించిందని పిటిషనర్ కోర్టుకు వివరించారు. గతంలో మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే నీటి సరఫరా జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కౌంటర్ దాఖలు చేయాలి: హైకోర్టు
స్థానిక సంస్థల వార్డుల రిజర్వేషన్లలో లాటరీ పద్ధతి విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ వేసి ఏడాదైనా కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత తెలిపింది. ఈక్రమంలో తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది. లాటరీ పద్ధతిలో స్థానిక సంస్థల వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యమెందుకు చేస్తోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ దాఖలై ఏడాదైనా ప్రభుత్వం స్పందించపోవడంపై మండిపడింది. కౌంటరు దాఖలు చేయకపోతే నేరుగా తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. వార్డుల రిజర్వేషన్ల లాటరీ విధానాన్ని సవాలు చేస్తూ బడంగ్‌పేట్‌కు చెందిన కొమరేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి ధర్మాసనం మంగళవారం నాడు విచారణ చేపట్టింది. రాష్ట్రప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.

High Court hearing on 3rd TMC of Kaleshwaram project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News