Friday, November 22, 2024

వలస నెత్తురోడిన రోడ్డు

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు
ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం

సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్‌కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు కబళించివేసింది. ఓ ట్రక్కు వారిపై దూసుకుపోవడంతో ఈ విషాదం సంభవించింది. రాజస్థాన్ నుంచి సూ రత్ జిల్లాలోని కొసంబా గ్రామంలో జరిగిన దుర్ఘటన వివరాలు ఇలా ఉ న్నాయి. దూర ప్రాంతాలకు తరలివచ్చి, పగలంతా పనిచేసి, రాత్రి రోడ్డుపక్కన పడుకుని ఉన్నప్పుడు వేగంగా వచ్చిన ట్రక్కు వీరిపై నుంచి వెళ్లింది. దీనితో వారు మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచారు. 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయ్యారు, ముగ్గురు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 19 ఏండ్ల యువ కూలీ తప్ప మిగిలిన వారు రాజస్థాన్‌లోని బన్స్‌వారా జిల్లాలోని గ్రామాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ట్రక్కు యమపాశంతో అసువులు బాసిన వారిలో ఓ పసికందు కూడా ఉండటంతో పరిస్థితి హృదయవిదారకం అయింది. ట్రక్కు ఓ చెరకు ట్రాక్టరును ఢీకొని అదుపుతప్పింది. తరువాత ఆదమరిచి నిద్రపోతున్న కూలీలపై నుంచి దూసుకువెళ్లింది. డ్రైవర్, క్లీనర్ ఈ ఘటనలో గాయపడి, చికిత్స పొందుతున్నారు. వీరిపై ఐపిసి సెక్షన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. అర్థరాత్రి తరువాత ఈ ట్రక్కు కిమ్ మాండ్వీ రహదారిలో కూలీలపై నుంచి వెళ్లిందని సూరత్ ఎస్‌పి ఉష రాడా తెలిపారు.

ఈ ప్రాంతం సూరత్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిమ్ నుంచి మాండ్వీకి వాహనం వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. వలసకూలీలు వేరే దిక్కు లేక ఫుట్‌పాత్‌పైనే నిద్రపోతున్నారు. ట్రాక్టర్‌ను ట్రక్కు ఢీకోనడంతో ముందటి అద్దం పగిలిపోయి, డ్రైవర్‌కు ముందున్నది ఏమిటనేది తెలియలేదని, దీనితో ఫుట్‌పాత్‌పైకి బండి దూసుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనలో గాయపడ్డ ముగ్గురు కూలీలకు ఆసుపత్రిలో చికిత్స జరిపిస్తున్నారు. మృతులలో అత్యధికులు 16 నుంచి 27 ఏండ్లలోపు వారే ఉన్నారు. బండంత బండి కింద పడి ఏడాది బాలిక తేజల్ మహిదా కూడా బోరుమంటూ ప్రాణాలు వదిలింది. మృతులలో అత్యధికులు రాజస్థానీయులు కావడంతో, ఈ ఘటన గురించి తెలియగానే అక్కడ విషాదం నెలకొంది.
ప్రధాని సహాయ నిధి నుంచి రెండు లక్షల చొప్పున
స్వరాష్ట్రం గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మృతుల దగ్గరి వారికి రూ రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ 50 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా విషాదకర ఘటన అని, బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ఘటనపై స్పందించారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ రెండు లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

15 Migrant Workers Killed as truck runs them in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News