- Advertisement -
జకార్తా: ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన 62మంది కుటుంబసభ్యులకు పరిహారం అందిస్తామని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు. బుధవారం జకార్తాలోని అంతర్జాతీయ టర్మినల్ వద్ద విమానం శకలాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 9న టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బోయింగ్ 737 విమానం జావా సముద్రంలో కూలిపోయింది. విమాన సంస్థ శ్రీవిజయ ఎయిర్ ద్వారా బీమా సొమ్ము 89,100 డాలర్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి 3,560 డాలర్ల చొప్పున అదనంగా ఇవ్వనున్నారు. ముగ్గురు మృతుల కుటుంబాలకు విడోడో సమక్షంలోనే పరిహారం అందించారు. బాధితులందరికీ పరిహారం వెంటనే అందిస్తామని విడోడో తెలిపారు.
- Advertisement -