Friday, November 22, 2024

రిజర్వేషన్లపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

CM KCR key decision on reservation for EWS

హైదరాబాద్: ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇడబ్ల్యూఎస్ వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లోనే అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహణకు ఆదేశించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10శాతం రిజర్వేషన్లు అవసరం ఉందని సిఎం పేర్కొన్నారు. ప్రస్తుత రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగించాని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇడబ్ల్యూఎస్ తో కలుపుకొని ఇకపై 60శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

CM KCR key decision on reservation for EWS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News