బెంగళూరు: ట్రక్కులో పేలుడు పదర్థాలు తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించిన సంఘటన కర్నాటకలో శివమొగ్గలో గురువారం 10.30 సమయంలో జరిగింది. హునసోడు గ్రామం సమీపంలో జరిగిన పేలుళ్లలో ఎనిమిది మృతి చెందారని శివమొగ్గ జిల్లా కలెక్టర్ కెబి శివ కుమార్ తెలిపారు. భారీగా పేలుడు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందని భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీశారు. భారీ పేలుడుకు మృతుల శరీర భాగాలు 1.5 కిలో మీటర్ల దూరంలో పడ్డాయని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. మైనింగ్ కోసం ట్రక్కులో భారీగా పేలుడు పదార్థాలు తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మృతులు బీహార్ కార్మికులు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2021