- Advertisement -
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్ శుక్రవారం నాడు ముంబయి జైలు నుంచి విడుదలైంది. హీరా గోల్డ్ కేసులో రెండున్నర ఏళ్లుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నౌహీరా షేక్‌కు 6 వారాల తాత్కాలిక బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈక్రమంలో బాధితులకు చెల్లించాల్సిన సొమ్ము సమకూర్చాలని నౌహీరాను సుప్రీంకోర్టు ఆదేశించింది. హీరాగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన వేలాది మందికి చెందిన వేల కోట్ల రూపాయలను తిరిగి ఇప్పించాలంటూ కోర్టుకు విన్నవించారు. కాగా నౌహీరాకు బెయిల్ లభించండం, జైలు నుంచి బయటకు వస్తున్న క్రమంలో తమ నగదు దక్కుతుందని బాధితులు ఎదురుచూస్తున్నారు
Nowhera Shaik released from Mumbai jail
- Advertisement -