Saturday, November 23, 2024

కేంబ్రిడ్జి అనలిటికాపై సిబిఐ కేసు

- Advertisement -
- Advertisement -

CBI case against Cambridge Analytica

 

ఫేస్‌బుక్ వినియోగదారుల డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా ఉల్లంఘన కేసులో కేంబ్రిడ్జ్ అనలిటికాపై సిబిఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనే ఆరోపణలతో యూకేకు చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాపై కేసు నమోదు చేసింది. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్‌ఆర్‌ఎల్) ను కూడా కేసులో చేర్చింది. దీనిపై ఫేస్‌బుక్ కూడా స్పందించింది.

సుమారు 5.62 లక్షల భార్తీయ యూజర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబల్ సైన్స్ కంపెనీ అక్ ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ ఎనలిటికాతో పంచుకుందని తెలిపింది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. కాగా దేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే లక్షంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్‌బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫేస్‌బుక్- కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా చోరీ కేసుపై సిబిఐ దర్యాప్తు చేయనుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News