Friday, November 22, 2024

మరిన్ని ఐటి పాలసీలు

- Advertisement -
- Advertisement -

More IT policies in Telangana

పెట్టుబడులు, మరితంగా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా కొత్త పాలసీ,  రాష్ట్ర ఐటి పాలసీ అద్భుతమైన ఫలితాలను అందించింది, పౌరుడి సౌకర్యం, సంక్షేమమే లక్ష్యంగా ఆన్‌లైన్, మొబైల్ సేవలు,  ఐదేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఐటి శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటి పాలసీ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ స్పూర్తితోనే రానున్న రోజుల్లో మరిన్ని నూతన ఐటి పాలసీలు తీసుకరానున్నట్లు ఆయన వెల్లడించారు. నూతన విధానంలో మరిన్ని పెట్టుబడులను తీసుకోవరావడమే లక్షంగా, నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు దక్కే విధంగా రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో తీసుకొచ్చి ఐటి పాలసీకి ఐదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో శనివారం ఆ శాఖపై మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు. నూతన ఐటి పాలసీకి సంబంధించి, అందులో పేర్కొనవలసిన అంశాలపైన ఆయన మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి అద్భుతమైన పేరు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను తీసుకరావడంలో ఐటి పాలసీ ఎంతగానో దోహదం చేసిందన్నారు. ఏ పాలసీ అయినా పౌరుల కేంద్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆలోచన అని అన్నారు.

ఆ దిశగానే ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన విధానాలకు రూపకల్పన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఐటి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి, ఆ శాఖను మరింత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులని ఈ రంగంలో తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. పెట్టుబడులతో పాటు ఐటి శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల పైన ప్రధాన దృష్టి సారించాలన్నారు. పౌరుడేగా కేంద్రంగా ప్రభుత్వ సేవలు అందించే విధానాలకు రూపకల్పన చేయాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే గత ఆరు సంవత్సరాలుగా ఈ ..-గవర్నెన్స్, ఆన్‌లైన్, మొబైల్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ సేవలను అందించిన విషయాన్ని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమీప భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టి ఫైబర్ కార్యక్రమం ద్వారా అందించాల్సిన కార్యక్రమాల పైన ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో బలమైన ఇన్నోవేషన్ ఇకో సిస్టం ఏర్పడిందని మంత్రి కెటిఆర్ అన్నారు.

ఇకపైన ఈ ఇకో సిస్టం ను మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఇన్నోవేషన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ముఖ్యం గా విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేందుకు కావాల్సిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నూతన పెట్టుబడులను హైదరాబాద్‌కు రప్పించడం ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిందన్నారు. స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. తద్వారా స్థానిక యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఈ దిశగా అవసరమైన కార్యాచరణను చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఐటి శాఖ విభాగాధిపతిలతో పాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

Minister KTR Review on IT Department

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News