Saturday, November 2, 2024

భారత్ లో కొత్తగా 14,849 మందికి వైరస్

- Advertisement -
- Advertisement -

14849 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 14,849 మందికి కరోనా వైరస్ సోకింది. కోవిడ్-19తో మరో 155 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,54,533కి చేరింది. 24గంటల్లో 15,948 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 1,03,16,786 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇండియాలో ప్రస్తుతం 1,84,408 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 1,53,339కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఇప్ప‌టి ‌ర‌కు మొత్తం 15,82,201 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, భారత్ లో నిన్నటి వరకు మొత్తం 19,17,66,871 కరోనా టెస్టులు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది. నిన్న 7,81,752 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.

14849 New Covid-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News