Sunday, November 24, 2024

ప్రియురాలులేని లోకంలో నేను ఉండలేను అని….

- Advertisement -
- Advertisement -

Young man commit suicide with lover in Jagtial

జగిత్యాల: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపం చెంది ప్రియుడు కూడా ప్రాణాలు తీసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మీపూర్ కు చెందిన రాఖేష్- ఓ యువతి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రాకేష్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. రాకేష్ ప్రియురాలుకి ఇంట్లో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో ఆమె రాకేష్ ను తప్ప వేరే అతడిని చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన రాఖేష్ అప్పటి నుంచి కలత చెందాడు.  దుబాయ్ లోని తాను ఉంటున్న గదిలో సూసైడ్ లెటర్ రాసి తాను ఆత్మహత్య చేసుకుంటున్ననని వీడియో తీసి పంపాడు. బై మమ్మీ ఐ మిస్ యూ అంటూ వీడియోలో సందేశం పంపాడు.  దీంతో లక్ష్మీపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News