నిజామాబాద్: సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి కన్నబిడ్డల కళ్లేదుటే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మణ్ – లక్ష్మి అనే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కామారెడ్డిలో లక్ష్మణ్ ఎలక్ట్రీషన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మేము తీసిన లాటరీలో కోటి రూపాయల మీకు వచ్చాయని లక్ష్మణ్‌కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. కోటి రూపాయలకు ట్యాక్స్ పడుతుందని కొంత చెల్లిస్తే ఈ ఇంటికి కోటి రూపాయలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో వారు చెప్పిన ఆకౌంట్లో రెండు సార్లు లక్ష్మణ్ రూ.2.65 లక్షలు, రూ.2 లక్షలు చెల్లించాడు. నెల రోజల వరకు వేచి చూసిన డబ్బుల రాలేదు. వాళ్లు చేసిన నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ రావడంతో మనోవేదనకు గురయ్యాడు. స్వగ్రామం పోసానిపేటకు వెళ్లి చనిపోతున్నానని కామారెడ్డిలో ఉన్న కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చెప్పాడు. వీడియో కాల్‌లో తన కుమార్తె వద్దని బతిమాలిన కూడా వినకుండా ఉరేసుకున్నాడు.
రూ. కోటి లాటరీ…. వీడియో కాల్ మాట్లాడుతూ ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -