Saturday, November 23, 2024

టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరం వాయిదా!

- Advertisement -
- Advertisement -

దుబాయి: ప్రతిష్టాత్మకమైన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి చారిత్రక లార్డ్ మైదానం వేదికగా ఈ ఫైనల్ పోరు జరగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ పోరు షెడ్యూల్‌లో మార్పులు చేయాలనే ఉద్దేశంతో ఐసిసి ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా పరిస్థితులను గమనిస్తే ఫైనల్ పోరు వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి కూడా అనధికారికంగా ధ్రువీకరించాడు. ఇదిలావుండగా కరోనా వల్ల టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరగాల్సిన పలు సిరీస్‌లు వాయిదా పడ్డాయి. దీంతో పాయింట్ల కేటాయింపులో ఐసిసి కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. తాజాగా గెలుపు శాతం అనే పద్ధతిలో పాయింట్లను కేటాయిస్తోంది. ఈ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

అయినా, ఐసిసి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే విధానం ప్రకారం పాయింట్లను కేటాయించాలని నిర్ణయించింది. ఇదిలావుండగా టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే జట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుచుకోవడం టీమిండియాకు కలిసి వచ్చింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఫైనల్ రేసులో ఉన్నాయి. దీంతో ఫైనల్ బెర్త్‌ను ఏ జట్లు దక్కించుకుంటాయనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ICC Test Championship final postponed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News