Saturday, November 23, 2024

రక్షణగా ఉండేది జవాన్, అన్నం పెట్టేది అన్నదాత: పోచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో పాలన సాగిస్తామన్నారు. ప్రపంచంలో అతివేగంగా కోవిడ్ వ్యాక్సిన్ కనుగోన్న దేశంగా భారత్ కీర్తి గడించిందని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లు 60 శాతం తెలంగాణలో ఉత్పత్తి కావడం దేశనికే గర్వకారణమన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం ఎలాంటి దుష్పరిణామాలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. దేశానికి రక్షణగా ఉండేది జవాన్ అని, అన్నం పెట్టేది అన్నదాతలు అని చెప్పారు. జవాన్లు, రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మనందరిదన్నారు. ఈ వేడుకల్లో చైర్మన గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి వీరేశం, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News