లక్నో: మంగళవారం గణతంత్ర దినోత్సవంనాడు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసిఎఫ్) ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ ఉదయం 8.45కు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మొక్కను నాటి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. మసీదు నిర్మాణ స్థలంలోని మట్టిని పరీక్షలకు పంపామని, ఆ నివేదిక రాగానే నమూనాలకు ఆమోదం తెలిపి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఫరూఖీ తెలిపారు. విరాళాల కోసం అభ్యర్థించామని, ఇప్పటికే ప్రజల నుంచి అవి అందుతున్నాయని ఆయన తెలిపారు. ట్రస్ట్‌లోని 12మంది సభ్యులు శంకుస్థాపనకు హాజరయ్యారు. గత నెలలోనే మసీదు నమూనాను ఐఐసిఎఫ్ ఆవిష్కరించింది. మసీదు వెనకాల హాస్పిటల్‌ను నిర్మించే ప్రణాళిక అందులో కనిపించింది. మసీదు నిర్మించే ధన్నీపూర్ గ్రామం రామాలయం నిర్మించే ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించింది.
అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
- Advertisement -
- Advertisement -
- Advertisement -