న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎంతో ప్రతిభావంతుడని మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసించాడు. ఆడిన తొలి సిరీస్‌లో నిలకడైన ఆటతో అలరించాడన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుపై గిల్ నిలకడగా రాణించడం టీమిండియాకు శుభపరిణామన్నాడు. అయితే గిల్‌పై అంచనాలు పెంచి ఒత్తిడికి గురి చేయొద్దని గంభీర్ సూచించాడు. రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో గిల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుందన్నాడు. అయితే ఇది గిల్‌పై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందన్నాడు. దీంతో అతనిపై ఒత్తిడి పడకుండా చూడాల్సిన బాధ్యత జట్టు కెప్టెన్‌పై ఉందన్నాడు. గిల్ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైందని, ఇలాంటి పరిస్థితుల్లో అతనిపై భారీ అంచనాలు పెట్టుకుని ఒత్తిడికి గురి చేయడం జట్టుకు మంచిది కాదన్నాడు. స్వేచ్ఛగా ఆడనిస్తే అతను భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉందన్నాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్‌లో గిల్‌పై ఎలాంటి అంచనాలు లేవన్నాడు. దీంతో అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడన్నాడు. అందువల్లే 51 సగటుతో 259 పరుగులు చేయగలిగాడని గంభీర్ వివరించాడు.
Not put to much pressure on Gill: Gambhir