Sunday, November 24, 2024

పోలీసులే నిజమైన స్టార్స్

- Advertisement -
- Advertisement -

Anushka launches Dial 100 vehicles with Women drivers

 

సైబరాబాద్‌లో షీ పాహి
మహిళలు పోలీసుల్లో చేరాలి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న సినీనటి అనుష్క శెట్టి
తెలంగాణలో మరిన్ని భరోసా కేంద్రాలు ఏర్పాటు
ఉమెన్ అండ్ సేప్టీ ఐజి స్వాతిలక్రా
సైబరాబాద్‌లో పనిచేస్తున్న 750మంది మహిళా పోలీసులు
మహిళా డ్రైవర్లు ఉన్న డయల్ 100 వాహనాలను ప్రారంభించిన అనుష్క

మనతెలంగాణ, హైదరాబాద్ : ఫిల్మీ స్టార్స్ కేవలం సినిమాల్లోనే స్టార్స్‌మని, పోలీసులు నిజజీవితంలో స్టార్స్ అని ప్రముఖ సినీ నటి అనుష్కశెట్టి అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ షీటీమ్స్ యానివర్సిలో భాగంగా ఏర్పాటు చేసిన షీ పాహి కార్యక్రమం బుధవారం జేఆర్‌సిలో ఏర్పాటు చేశారు. ఉమెన్ పోలీసులు డ్రైవర్లుగా వ్యవహరించే డయల్ 100 వాహనాలను అనుష్క ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీనటి అనుష్కశెట్టి మట్లాడుతూ పోలీసులు అన్ని సమయాల్లో శాంతిభద్రతల అదుపుకోసం పనిచేస్తారని అన్నారు. పోలీసులు ఇరవై నాలుగు గంటలు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని, భద్రంగా ఉన్నామనే ఫీలింగ్‌తో ఉంటున్నారని అన్నారు. కరోనా సమయంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్లాస్మా దానం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడారని అన్నారు. పోలీసులు లేకుండా ప్రజల జీవితాలు భద్రంగా ఉండడం ఊహించలేమని అన్నారు.

శాంతిభద్రతల్లో మహిళా పోలీసులు భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి తల్లి బలమని అన్ని అంశాల్లో అండగా నిలుస్తుందని అన్నారు. పోలీసు ఉద్యోగం చేస్తున్న మహిళలు చాలా సవాళ్లు ఎదుర్కొంటారని అన్నారు. ఇల్లును చక్కబెట్టడం, పిల్లలను పెంచడం సవాల్‌తో కూడిన విషయమని అన్నారు. తల్లులకు అన్ని విషయాల్లో అవగాహన ఉంటుందని అన్నారు. మహిళలు ముందుకు వచ్చి పోలీసుల్లో చేరాలని అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఐజి స్వాతిలక్రా మాట్లాడుతూ పోలీసుల్లో పురుషుల, మహిళల పట్ల ఎలాంటి భేదాలు లేవని, ఇద్దరిని సమానంగా చూస్తారని అన్నారు. పురుషులు, మహిళలు కలిసి పనిచేస్తారని, మంచి సర్వీసును అందించడమే పోలీసుల ముందు ఉన్న కర్తవ్యమని అన్నారు. 2016లో తెలంగాణలో నాలుగు ప్రాంతాల్లోనే భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పది కేంద్రాల్లో భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

భరోసా కేంద్రాలు పిల్లలు, మహిళలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాయని తెలిపారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వేధింపులకు గురయ్యేవారికి భరోసా కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సిసిటివిల ఏర్పాటు శుభపరిణామమని అన్నారు. కేసుల దర్యాప్తులో సిసిటివిల పాత్ర కీలకమని అన్నారు. డయల్ 100 స్పందన రాష్ట్రంలో పది నిమిషాలకంటే తక్కువగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో దీనిని మరింత తగ్గిస్తామని అన్నారు. గర్ల్ సేఫ్టీ క్లబ్బులను పన్నెండు కాలేజీల్లో ప్రారంభించామని, ఇందులో 300మంది వలంటీర్లు పనిచేస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో తాము 2,500 కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో సమావేశమయ్యామని అన్నారు.

వలంటీర్లు పోలీసుల కల్లు, చెవులుగా పనిచేస్తారని అన్నారు. కొత్తగా పోలీసుల్లో చేరిన వారు సమాజానికి సేవ చేయాలని అన్నారు. జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నారని, పోలీసుల్లో కూడా 50 శాతం మహిళలు ఉండాలని అన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని 17వర్టికల్స్‌లో మహిళలు ఉండాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఉమెన్ సేఫ్టీ డిసిపి అనసూయ మాట్లాడారు. కార్యక్రమంలో అనుపమా సజ్జనార్, డిసిపిలు పద్మజా, ఎస్‌ఎం విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఎడిసిపిలు కవిత, ఇందిరా, లావణ్య, మాణిక్‌రాజ్, సిఎఓ గీత, చంద్రకళ, ఎస్‌సిఎస్‌సి జనరల సెక్రటరీ కృష్ణ ఏదుల, భరణి, ప్రత్యూష శర్మ తదితరులు పాల్గొన్నారు.

50 శాతం మహిళలు సైబరాబాద్‌లో ఉన్నారు: విసి సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 50 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 750మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. పోలీసుల్లో 12శాతం మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ పోలీసు ఆఫీసర్లలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని అన్నారు. 34శాతం మంది మహిళలు ఇన్వెస్టిగేషన్ అధికారులుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఉమెన్ ఎస్సై స్వేత పురుషులతో సమానంగా పనిచేస్తోందని తెలిపారు. ఉమెన్ కోర్టు కానిస్టేబుల్‌గా పనిచేస్తున పంకజా 16మంది నిందితులకు జీవితఖైదు శిక్ష పడేవిధంగా కృషి చేశారని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News