స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తుందనే విషయం తెలిసిందే. రెగ్యులర్‌గా వర్కవుట్స్‌తో పాటు యోగా కూడా ఆమె చేస్తూ ఉంటుంది. జిమ్‌లో చేసే వర్కవుట్ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడిస్తూ వస్తోంది. అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఫిట్‌నెస్‌ని అశ్రద్ధ చేయకుండా వెయిట్‌లిఫ్టింగ్ చేస్తోంది. అయితే తనకు ఎప్పటినుంచి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెరిగిందనే విషయం గురించి తాజాగా సామ్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో చిట్‌చాట్ చేసిన సమంత.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీకో బిగ్ సీక్రెట్ రివీల్ చేస్తున్నానని చెప్పిన సామ్.. “నేను ఎందుకు జిమ్ స్టార్ట్ చేశానో తెలుసా? నాగచైతన్యను పడేయడం కోసమే.
చైతూ ఎప్పుడూ జిమ్‌లోనే గడుపుతాడు. అందుకే నేను కూడా జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నాను”అని చెప్పింది. ఇంకా మీ ఫెవరేట్ క్యారక్టర్ ఏంటని అడుగగా.. ’ఓ బేబీ’, ’ది ఫ్యామిలీ మ్యాన్’ పాత్రలంటే ఇష్టమని… వీటిలో ఏదో ఒకటి చెప్పమంటే కష్టమని చెప్పింది. చైతన్య ఎందుకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడని అడుగగా.. ’‘చై ఎందుకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడని అందరూ అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నాను. చెప్పు చైతన్య.. ఎందుకు?” అని ఆమె కూడా ప్రశ్నించింది.