- Advertisement -
యోండే: కామెరూన్ దేశంలోని సంత్చౌ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 53 మంది సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చాంగ్, బఫోసమ్, అవాఫోంకా, అగష్టీన్ ప్రాంతాలలోని ఆస్పత్రులకు తరలించారు. దౌలాల నుంచి బఫౌషమ్కు బస్సు వెళ్తుండగా సంత్చౌ గ్రామంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. బస్సుపై ఆయిల్ పడడంతో మంటలంటుకొని కొన్ని నిమిషాల వ్యవధిలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. కామెరూన్లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. గత డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 37 మంది మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. కామెరూన్ దేశం అంటేనే రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారింది.
- Advertisement -