- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ ఖాతాలో మరో ప్రపంచరికార్డు చేరింది. ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ కోవిడ్ టీకాలు పూర్తి చేసింది. అమెరికా, యుకె, జర్మనీ, ఇజ్రాయెల్, యుఎఇ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల కంటే చాలా తక్కువ సమయం తీసుకుంటూ కేవలం 6 రోజుల్లోనే 1 మిలియన్ మందికి టీకాలు వేసే అద్భుత ఘనతను భారత్ సాధించిందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం ప్రకటించారు. అయితే అగ్రరాజ్యం అమెరికా 10 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తిచేయగా, స్పెయిన్ 12 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. 18 రోజుల్లో యుకె మిలియన్ టీకాలు పూర్తిచేసింది. భారత్ లో 25లక్షల మందికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేశారు. మధ్యాహ్నం 2గంటల వరకు 25లక్షల మందికి పైగా కోవిడ్ టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
India reach 1 million Covid vaccinations in 6 days
- Advertisement -