ఏర్పాట్లు పరిశీలించి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి
హైదరాబాద్: గాంధీ వర్దంతిని పురస్కరించుకుని ఈనెల 30న లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌కు గవర్నరు, ముఖ్యమంత్రి సహా ప్రముఖలందరూ విచ్చేసి శ్రద్దాంజలి ఘటిస్తారని అందుకోసం ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిఆర్‌ఓ అనీల్‌కుమార్‌తో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పర్యాటక,అగ్నిమాపక, ఉద్యానవన తదితర శాఖల అధికారులతో కలిసి బాపూఘాట్‌లో ఏర్పాట్లపై క్షేత్రస్దాయి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యారికేడింగ్, శానిటేషన్, సైడ్‌వాల్స్, పుష్పాలంకరణ వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.
బాపూఘాట్ సమాధి వద్ద ప్రముఖులు శ్రద్దాంజలి ఘటించేందుకు వీలుగా విడి పూలతో పాటు చక్కటి పుష్పగుచ్చాలు సిద్దంగా ఉంచాలని సూచించారు. సందర్శకులకు మంచినీరు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య చికిత్స కిట్లు, డాక్టర్లు సహా అంబులెన్స్ ఆవరణలో సిద్దంగా ఉంచాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు వైద్యాధికారి సరళకుమారి, విద్యుత్తుశాఖ అధికారి శ్రీనివాసరావు, ఆర్‌అండ్ బి అధికారి మెహాన్‌బాబు, కామలేష్‌కుమార్, వాటర్ వర్క్ అధికారి శంకర్, జీహెచ్‌ఎంసీ ఈఈ సత్యనారాయణ, ఉద్యానవన శాఖ అధికారి రాధాకృష్ణ, గొల్కొండ తహాసీల్దారు అయ్యప్ప, అగ్నిమాపక అధికారి అశోక్‌కుమార్, లైజనింగ్ ఆఫీసర్ జౌహార్ తదితరులు పాల్గొన్నారు.
Hyderabad Collector Sweta Mohanty visiting Bapu Ghat