Thursday, September 19, 2024

శంషాబాద్ విమానాశ్రయం నుండి కూరగాయల ఎగుమతి

- Advertisement -
- Advertisement -

Export of vegetables from Shamshabad Airport

 

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
మంత్రి నిరంజన్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పండించిన పండ్లు, కూరగాయలను శషాబాద్ విమానాశ్రయం నుండి ఎగుమతి చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఉద్యానపంటల అధ్యయనంలో భాంగంగా కర్ణాటక రాష్ట్ర పర్యటనలో ఉన్న మంత్రి శుక్రవారం బెంగుళూరు లాల్‌బాగ్‌లోని హాప్‌కామ్స్, మదర్ డైయిరీ, సఫల్ యూనిట్లు, తిరుమ్‌హెట్టి హల్లి ఆనందరెడ్డి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి విమానాశ్రయం ద్వారా కూరగాయల ఎగుమతికోసం జీఎంఆర్ సంస్థతో సమావేశం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ నలువైపులా మార్కెట్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శంషాబాద్, వంటిమామిడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో రైతు సహకార సంస్థల ద్వారా మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు.

దళారీ వ్యవస్థ పోయి రైతులకు, వినియోగదారులకు నేరుగా సంబంధాలు ఏర్పడాలన్నారు. అప్పుడే రైతుల శ్రమకు తగిన గిట్టబాటు ధరలతో పాటు, వినియోగదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన పండ్లు, కూరగాయాలు లభిస్తాయన్నారు.కర్నూలు-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతి యూనిట్లను ఏర్పాటు చేయాలని , అందుకోసం ప్రభుత్వ సహకారం అందిస్తామని ప్రకటించారు. మదర్ డెయిరీ , సఫల్ యూనిట్ల ఉత్పత్తులు ఎంతో బాగున్నాయన్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. రైతులతో నేరుగా సంస్థలే సంబంధాలు నెరపాలన్నారు.

ఆ ఉద్దేశంతోనే బీచుపల్లిలో వేరుశనగ నూనె ఉత్పత్తి కేంద్రం, అశ్వారావుపేటలో ముడి ఆయిల్‌పాం ఉత్పత్తికి ఆదేశాలిచ్చామన్నారు. రైతు సహకార సంఘాలు , రైతు ఉత్పత్తి కేంద్రాల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ముందు చూపుతో ఉన్నట్టు తెలిపారు. రైతుబంధు సమితిలు, రైతు వేదికలతో తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, హార్టీకల్చర్ వర్శిటీ విసి నిరజా ప్రభాకర్ , కర్ణాటక ఉద్యాన శాఖ డిడి పరాశివమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News