- Advertisement -
కోల్‌కత: పశ్చిమ బెంగాల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే రాజీవ్ బెనర్జీ తన టిఎంసి ప్రాథమిక సభ్యత్వానికి కూడా శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో ఆయన త్వరలోనే బిజెపిలో చేరడం ఖాయమన్న ఊహాగానాలు బలపడ్డాయి. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజీవ్ బెనర్జీ తన రాజీనామా లేఖను పంపించారు. గత వారం రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న రాజీవ్ బెనర్జీ తాను టిఎంసి నుంచి అన్ని పదవుల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. టిఎంసితో రెండు దశాబ్దాల అనుబంధం గల రాజీవ్ మమత క్యాబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు.
- Advertisement -