Saturday, November 16, 2024

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే

- Advertisement -
- Advertisement -

Anything is possible if there is will: Kohli

 

విరాట్ కోహ్లి

చెన్నై: సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు సభ్యులు చెన్నై చేరుకున్నారు. వీరంత ప్రస్తుతం బయోబబుల్ పరిధిలో ఉన్నారు. దీంతో కోహ్లితో సహా అతని సహచరులు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఇదే సమయంలో క్రికెటర్లలందరూ తమకు తోచిన విధంగా కాలక్షేపం చేస్తున్నారు. కానీ, కెప్టెన్ విరాట్ మాత్రం ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. ఖాళీ సమయాన్ని ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. సంకల్పం ఉంటేనే హోటల్ గదుల్లో కూడా ఫిట్‌నెస్ సాధించవచ్చని ట్వీటర్‌లో పోస్ట్ పెట్టాడు. సాధించాలనే పట్టుదలతో, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని పేర్కొన్నాడు. ఇక క్వారంటైన్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను మొదలు పెట్టే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News