చంపాలని బాధితుల డిమాండ్
పితోర్‌గఢ్: ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు చిరుతపులిని చంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చిరుత దాడిలో ముగ్గురు మహిళలు బలయ్యారని వారు ఆందోళన చేపట్టారు. చనిపోయినవారి కుటుంబాల నుంచి ఒకరి చొప్పున ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అటవీ అధికారులు చిరుతను పట్టుకునే విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు జగదీశ్‌కుమార్ ఆరోపించారు. చిరుతను చంపేందుకు ఓ బృందాన్ని పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ అధికారులు ఓ వేటగాడిని మాత్రమే పంపారని ఆయన తెలిపారు. ఒక్కరి వల్ల దానిని పట్టుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. చిరుతను చూశామని పలువురు గ్రామీణ ప్రజలు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి మేలాపానీ ప్రాంతంలో చిరుతను చూశామని చెబుతున్న కొందరు ఒక నిమిషంపాటు వీడియో క్లిప్ కూడా ఉన్నదని తెలిపారు.