Thursday, December 5, 2024

ఎర్రకోటలో ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Forensic team to visit Red Fort to collect Evidence

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై జరిగిన అలజడిపై దర్యాప్తు చేస్తున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందం శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడ రైతు జెండాతోపాటు ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆందోళనకారులకూ, పోలీసులకూ మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఎర్రకోట ఘటనలపై ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచికి చెందిన పలు బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఎర్రకోట ఘటనను దేశ వ్యతిరేక చర్యగా పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాలను సేకరించేందుకు ఫోరెన్సిక్ బృందం అక్కడికి వెళ్లినట్టు ఓ అధికారి తెలిపారు.

Forensic team to visit Red Fort to collect Evidence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News