దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి శనివారం ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మన్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇప్పటి వరకు ఏడో స్థానంలో కొనసాగిన పుజారా ఒక ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు బాబర్ ఆజమ్ ఆరు నుంచి ఏడో ర్యాంక్‌కు పడిపోయాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె కూడా 8వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా పుజారా, రహానెలు తమ ర్యాంక్‌లను మెరుగు పరుచుకున్నారు.
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నాలుగో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే ఆడిన కోహ్లి ఆ తర్వాత స్వదేశానికి వెళ్లి పోయాడు. దీని, ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై పడింది. తాజా ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ రెండో, లబుషేన్ మూడో ర్యాంక్‌ను కాపాడుకున్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కమిన్స్(ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత బౌలర్లు అశ్విన్, బుమ్రాలు టాప్10లో చోటు కాపాడుకున్నారు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జడేజా మూడో, అశ్విన్ ఆరో స్థానంలో నిలిచారు.
Pujara Climbs to 6th spot in ICC Test Rankings