Saturday, November 23, 2024

మళ్లీ పులివేట

- Advertisement -
- Advertisement -

అటవీ శాఖ అధికారుల కసరత్తు
మూడు రోజుల్లో మూడు పశువులను చంపిన వైనం
జనాలు అప్రమత్తంగా ఉండాలిః మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Forest Officers search for Tiger

మనతెలంగాణ/హైదరాబాద్: కొమురం భీం జిల్లాలో పులి గడచిన నాలుగు రోజులలో మూడు పశువులను చంపేసింది. దీంతో సిర్పూర్ టీ మండలంలో పులి సంచారం పై జనం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు..పులిని పట్టుకోవడానికి రెండు నెలలుగా అటవీ శాఖ ప్రయత్నం చేస్తుందని అయినా చిక్కకపోవడంతో పులిని పట్టుకోవడం కోసం అధికారులు మరోసారి సమాయత్తం అవుతున్నారు కొమురం బీం జిల్లా ఉన్నతాదికారుల రివ్యూ సమావేశం వివిధ అభివృద్ది అంశాలపై చర్చించిన తర్వాత మంత్రి ఈ పులి సంగతి ప్రకటించారు పులి ని మహరాష్ట్ర నిపుణుల సహకారంతో పట్టుకుంటామని ఇంద్ర కరణ్ రెడ్డి స్పష్టం చేశారు. కొమురం భీం జిల్లాలో పులి మత్తు ప్రయోగానికి పది రోజుల క్రితమే తాత్కాలిక బ్రేక్ పడింది. మహరాష్ట్ర రాపిడ్ రెస్క్యూ టీం ,వరంగల్ రెస్క్యూ టీం లు వెనుదిరిగి వచ్చాయి. మళ్లీ క్యాటిల్ కిల్ అయితే రెస్క్యూ టీంలను పిలిపించే అవకాశం ఉందని అప్పుడు పేర్కొన్నారు. ఇప్పుడు మూడు పశువులు మృత్యు వాత పడడంతో మళ్ళీ వాళ్ళను రప్పిస్తున్నారు. ఇక పది రోజుల క్రితం ఆరు రోజుల పాటు ఈ టైగర్ ఆపరేషన్ కొనసాగింది. అయినా పులి చిక్కలేదు. కాగజ్ నగర్ కారిడార్ లో మనుషులను చంపిన పులిని పట్టుకోవడం కోసం అధికారులు అడవుల్లో ఆపరేషన్ చేపట్టారు. పులిని పట్టుకోవడానికి ప్రత్యేక టీములను రంగంలోకి దింపారు. అది మహారాష్ట వెళ్ళిపోయిందని భావించే వెనక్కు రప్పించారు. కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి సంచరించడంతో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ సరిహద్దులను దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిపోయిందని భావించిన పులి తిరిగి రావడంతో మరోసారి దానిని బంధించేందుకు సిద్ధమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్ పేట్, బెజ్జూర్ మండలాల్లో మళ్లీ పెద్దపులి సంచరించింది. ప్రాణహిత నది, పెద్దవాగు నదుల పరివాహక ప్రాంతాల్లో సంచరించడాన్ని స్థానికులు చూశారు. దాంతో వారు బెంబేలెత్తిపోయారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాని పాదముద్రలను పరిశీలించిన అధికారులుమ్యాన్ ఈటర్ మళ్లీ వచ్చినట్లు నిర్ధారించారు.

రాంపూర్‌లో పులి జాడలు:

గత మూడు రోజులుగా పులి రాంపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటు అటవీశాఖ అధికారులు,ఇటు స్థానికులు గుర్తించారు. కాగా, జనవరి 18న కందిభీమన్న అటవీ ప్రాంతంలో మ్యా ఈటర్‌ను బంధించేందుకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆ సమయంలో పులి మహారాష్ట్రవైపు వెళ్లిపోయింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ఉపసంహరించుకున్నారు. తాజాగా పులి మళ్లీ వచ్చింది. ఈ నెల 27వ తేదీన కందిగాం, కమ్మర్‌గా, అగర్ గూడలో సంచరించిన పెద్దపులి రాంపూర్ అటవీ ప్రాంతంలో మూడు పశువులను చంపేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పులిని ఈసారి ఎలాగైనా బంధించాలని ఫిక్స్ అయ్యారు.

35 గ్రామాలు అప్రమత్తం: ఫారెస్ట్ ఆఫీసర్ శాంతరాం

పెద్దపులి సంచారం నేపథ్యంలో దిగిడ, మొర్రుగూడ, లోహా తో పాటు 35 గ్రామాలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ శాంతరాం మీడియాతో పేర్కొన్నారు. త్వరలోనే రెండవ దశ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పిన ఆయన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ సమీపంలో గల పంట పొలాల్లోకి, పశువులను కాసేందుకు, వాగుల్లో చేపల వేటకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పులిని పట్టుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని, వారి సహకారం లేకుంటే తాము ఏమీ చేయలేమని శాంతరాం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News