Friday, November 22, 2024

ఎన్నికల రాష్ట్రాలకు రోడ్లు, మెట్రో రైళ్లు

- Advertisement -
- Advertisement -

Poll-bound West Bengal, Kerala and Assam get road, Metro projects

 

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, అసోంలకు రహదారులు, మెట్రో ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత కల్పించారు. ఈ రాష్ట్రాలు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నాయి. ఈ రాష్ట్రాలలో రోడ్, జాతీయ రహదారుల అభివృద్ధి సంబంధిత ప్రతిపాదనలను తీసుకువచ్చిన ఆర్థిక మంత్రి ఇందుకు ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కేరళలో రహదారులు, హైవేల ప్రాజెక్టుకు రూ65000 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ 25000 కోట్లు, అసోంకు రూ 3400 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. కొచ్చి మెట్రో ఫేజ్ 2 నిర్మాణ పనులు త్వరలో ఆరంభం అవుతాయి. 11.5 కిలోమీటర్ల ఈ మార్గం నిర్మాణానికి రూ 1,957 కోట్లు వ్యయ అంచనాలు వేశారు. ఎప్రిల్ లేదా మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ జరుగుతాయి. దేశవ్యాప్తంగా రహదారుల అభివృద్థికి, మరమ్మత్తులకు ప్రాధాన్యత ఇస్తారు. కేంద్ర బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను మిళితం చేసే పద్థతి ఉన్నందున ఈ ప్రాజెక్టు గురించి ఆర్థిక మంత్రి విశదీకరించారు. 2022మార్చి నాటికి 8500 కిలోమీటర్ల మేర రోడ్లు, అదనంగా 11000 కిలోమీటర్ల మేర హైవే కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

పట్టణ ప్రాంతాలలో ఇప్పుడున్న ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడేలా రూ 18000 కోట్ల పథకం తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. మరిన్ని ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటు కూడా జరుగుతుంది. రహదారులు రవాణా మంత్రిత్వశాఖకు పెంచిన కేటాయింపుల మొత్తం రూ 1,18,101 కోట్లుగా ప్రకటిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో ఇంతకు ముందు లేని రీతిలో అత్యధికంగా అంటే రూ 1,08,230 కోట్లు మూలధన పెట్టుబడిగా ఉంటుంది, గత నెలలో సంబంధిత విషయాల మంత్రి నితిన్ గడ్కరీ దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 60000 కోట్ల మేర హైవేల నిర్మాణం జరుగుతుందని ప్రకటించారు. ఇందులో 2500 కిలోమీటర్ల పరిధిలో ఎక్స్‌ప్రెస్ హైవేలు ఉంటాయి. 9000 కిలోమీటర్ల పరిధిలో ఎకనామిక్ కారిడార్లు, 2000 కిలోమీటర్ల పరిధిలో కీలక సరిహద్దు ప్రాంతాల రాదార్లు, తీర ప్రాంత రోడ్లు నిర్మాణం జరుగుతుంది. ఇవి కాకుండా 100 పర్యాటక కేంద్రాలు, 45 టౌన్లకు హైవేలతో అనుసంధానం ఏర్పడుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News