లక్నో: తన కూతురు కిడ్నాప్‌కు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెతికిపెట్టడానికి వాహనంలో డీజిల్ కొట్టించాలని పోలీసులు డిమాండ్ చేశారని ఓ తల్లి మీడియా ముందు కన్నీంటిపర్యంతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం… ఓ దివ్యాంగురాలైన మహిళకు కూతురు ఉంది. తన కూమార్తె కిడ్నాప్‌కు గురైందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు అలసత్వం వహించడంతోపాటు ఆమెతో దురుసుగా ప్రవర్తించారు. కొని సార్లు తనని బయటకు నెట్టేశారని, తన కుమార్తెపై నిందలు కూడా వేశారని, తమ వాహనాల్లో డీజిల్ నింపితే వెతికిపెడుతామని పోలీసులు అడగ్గానే డీజిల్ నింపించానని తెలిపింది. లంచం మాత్రం ఇవ్వలేనని మీడియా ఎదుట పేర్కొంది. తన బంధువే కిడ్నాప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించినట్టు సమాచారం. ఈ ఘటనపై ఉన్నతాధికారి బ్రజేశ్ కుమార్ శ్రీవాత్సవ్ స్పందించారు. కేసు నమోదు చేసి యువతిని వెతకాలని పోలీసులకు ఆదేశించడంతో పాటు తమ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.