Monday, November 25, 2024

నిండు ప్రాణాలను కాపాడిన మెట్రో….

- Advertisement -
- Advertisement -

Hyderabad metro helped rush a live organ

కామినేని ఆసుపత్రి నుంచి అపోలోకు గుండె తరలింపు
ఆరగంటలో 16స్టేషన్లు దాటి 21కిమీ దూరం చేర్చిన మెట్రో రైలు
అపోలో వైద్యులు డా. గోఖలే నేతృత్వంలో వేరొకరికి అమర్చేందుకు శస్త్రచికిత్స
మెట్రో సేవలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న గ్రేటర్ వాసులు
ఇలాంటి అవకాశం దొరకడం అదృష్టంగా బావిస్తున్నమని మెట్రో ఉన్నతాధికారుల వెల్లడి

హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న రోగికి మార్పిడి చేయడం కోసం ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుప్రతి నుంచి గుండెను తరలించారు. నాగోల్ ఓప్రత్యేక రైలును ఏర్పాటు చేసి గుండెను మధ్యాహ్నం 3.30 గంటలకు తరలించారు. మొత్తం 21కిలోమీటర్లు…16స్టేషన్లు నాగోల్ ,జూబ్లీహిల్స్ మధ్య ఈరైలు దాటింది. కేవలం 30 నిమిషాల లోపుగానే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో జూబ్లీహిల్స్ చేరింది. అన్ని స్టేషన్లులోనూ పిఏ సిస్టమ్ ద్వారా ఈప్రత్యేక రైలు గురించి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి గుండెను ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మోత్కూరుకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.

దీంతో గుండెను శస్త్రచికిత్స ద్వారా వేరొకరికి అమర్చేందుకు అపోలో వైద్యులు ఏర్పాట్లు చేశారు. డా. గోఖలే నేతృత్వంలో ఈశస్త్రచికిత్స నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాట్ల గురించి ఎల్‌అండ్ టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కెవిబీరెడ్డి మాట్లాడుతూ మేము ఎల్లప్పుడు ప్రజలు సేవలోను ఉంటామని, ఓనిండు ప్రాణం కాపాడటానికి మా వనరులన్నీ ఉపయోగించుకునేందుకు భగవంతుడు మాకు ఓ అవకాశం అందించారు. కామినేని, అపోలో ఆసుపత్రులకు ఈసందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వారు ఈ మహోన్నత అభ్యర్దనతో మమ్మల్ని చేరుకున్నారు. మేము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రత్యేక గ్రీన్‌కారిడార్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక రైలును నాగోల్ నుండి జూబ్లీహిల్స్‌కు ఎక్కడ ఆపకుండా నడిపామని, తద్వారా సమయానికి గుండెను తరలించి ఓనిండు ప్రాణాన్ని కాపాడామని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News