Monday, November 25, 2024

బిడ్డతో కలిసి భవనంపై నుంచి దూకిన మహిళ

- Advertisement -
- Advertisement -

woman jumps from a building with her baby

బిడ్డతో కలిసి భవనంపై నుంచి దూకిన మహిళ
బిల్డింగ్‌పై నుంచి దూకిన మహిళ

హైదరాబాద్: భార్యభర్తల మధ్య జరిగిన గొడవతో జీవితంపై విరక్తి చెందిన మహిళ భవనంపై నుంచి బిడ్డతో కలిసి దూకిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బీహార్‌కు చెందిన బిమల్ కుమార్ భార్య ఆర్తి, కూతురుతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ బస్తీలో ఉంటున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యభర్తల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. భర్తతో ఆర్తి గొడవ పెట్టుకుంది. ఆవేశానికి లోనైన ఆర్తి కుమార్తెతో కలిసి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్తి, చిన్నారిని ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. చిన్నారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

woman jumps from a building with her baby

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News