Thursday, November 21, 2024

సిబిఎస్‌ఇ పరీక్షల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్‌లో ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్

CBSE Exam Schedule Released 2021

హైదరాబాద్: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సిబిఎస్‌ఇ 10,12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి జూన్ 11 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్‌లో ప్రకటించారు. పదవ తరగతి పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో కొనసాగుతాయి.

తొలి షిఫ్ట్ ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు, రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. ఏటా ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షలు మే 4,6,10,11,12,13,15,17,18,20,21,22,25,27,29,31, జూన్ 2,7 తేదీలలో జరుగనుండగా, 12వ తరగతి పరీక్షలు మే 4,5,6,8,11,12,13,15,17,18, 19,20,21,22,24, 25,28,29,31, జూన్ 1 తేదీలలో పరీక్షలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News