Monday, November 25, 2024

ఏడాది చివరలో స్పేస్‌ఎక్స్ అంతరిక్షయానం

- Advertisement -
- Advertisement -

SpaceX space flight at the end of the year

 

తొలి ప్రైవేటు యాత్రకు మరో ముందడుగు

వాషింగ్టన్ : ప్రపంచంలోనే తొలి ప్రైవేటు అంతరిక్షయానానికి స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా అవి పూర్తి చేసి ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపించాలని మస్క్ ప్రణాళిక రచిస్తున్నారు. దీనికోసం డ్రాగన్ క్రూ క్యాప్సుల్‌ను వినియోగించనున్నారు. ఈ క్యాప్సూల్ ద్వారా నలుగురు వ్యక్తుల్ని కక్ష్యలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సిద్ధమవుతోంది. ‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ ఈ వ్యోమనౌకకు నాయకత్వం వహిస్తారని స్పేస్‌ఎక్స్ తెలిపింది. స్పేస్ క్యాప్సుల్‌లోని నాలుగు సీట్లను ఆయనే కొనుగోలు చేశారని, అందువల్ల మిగిలిన ముగ్గురి పేర్లను ఆయనే నిర్ణయిస్తారని స్పేస్ ఎక్స్ వెల్లడిచింది.

ఇదిలా ఉంటే ఈ స్పేస్ జర్నీ కోసం వ్యోమగాములకు అవసరైన శిక్షణను ఇన్‌స్పిరేషన్-4 సిబ్బంది ఇవ్వనున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. దీనికోసం డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆర్బిటాల్ మెకానిక్స్, జీరో గ్రావిటీని తట్టుకోవడంతో పాటు ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఇన్‌స్పిరేషన్-4 వెల్లడించింది. ఈ స్పేస్ జర్నీ కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని, అందులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్ ప్రతి 90 నిముషాలకు భూమి చుట్టూ ఒక చుట్టు తిరుగుతుందని స్పేస్ ఎక్స్ వెల్లడిచింది. దీనికోసం ఓ నిర్దేశిత కక్ష్యను కూడా నిర్ణయించనున్నట్లు తెలిపింది. మొత్తం ట్రిప్ ముగిసిన తరువాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ చేయనున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News