- Advertisement -
అనుమతించిన చైర్మన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలనుద్దేశిస్తూ రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు అదనంగా ఐదు గంటలు కేటాయించేందుకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అంగీకరించారు. బిఎసిలో దీనికి అంగీకారం కుదిరిందని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌జోషి తెలపడంతో నాయుడు అందుకు అనుమతి ఇచ్చారు. మొదట నిర్ణయించిన ప్రకారం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు 10 గంటలు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు ఈ సమయాన్ని 15 గంటలకు పెంచారు. రైతుల ఆందోళన అంశం కూడా రాష్ట్రపతి ప్రసంగంలో ఉన్నందున, దానిపైనా చర్చించాలని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నేత గులాంనబీ ఆజాద్ సూచించారు. రెండు నెలలకుపైగా జరుగుతున్న ఆందోళనపై చర్చించాలని 19 పార్టీలు డిమాండ్ చేశాయని ఆయన గుర్తు చేశారు. దాంతో, రైతుల అంశంపైనా చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
- Advertisement -