Friday, November 22, 2024

పెళ్లి వద్దన్నందుకు ప్రియురాలిని చంపిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

Man murder to lover in Medchal

మేడ్చల్: ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఆమెను ప్రియుడు చంపిన సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల పరిధిలో జరిగింది. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న మహిళ మృతదేహం కేసును పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీకాకుళం చేందని సంతోష(10) తన భర్తతో కలిసి పది సంవత్సరాల నుంచి ఘట్‌కేసర్‌లో ఉంటుంది. దంపతులు శ్రీరామ్ పౌల్ట్రీ ఫారమ్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతుల మధ్య గొడవ జరగడంతో నాలుగు సంవత్సరాల క్రితం ఆమె విడిచి భర్త వెళ్లిపోయాడు. గత కొన్ని రోజుల నుంచి మహారాష్ట్రకు చెందిన వినోద్(28)తో వివాహేతర సంబందం పెట్టుకున్నట్టు సమాచారం. పెళ్లి చేసుకుందామని వినోద్ పలుమార్లు ఆమెకు చెప్పనా పట్టించుకోలేదు. ఎదులాబాద్ సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను ప్రియుడు తీసుకెళ్లి తాడుతో ఉరేసి చంపేసిన అనంతరం తన ఇంటికి వెళ్లిపోయాడు.  పోలీసులు కేసు నమోదు చేసి స్థానికుల సమాచారం మేరకు తూంకుంటలో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తానే హత్య చేశానని వినోద్ ఒప్పుకున్నాడు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News