నల్గొండ: పెళ్లి చేసుకున్న అనంతరం భార్యను వదిలిపెట్టి ఆస్ట్రేలియాకు వెళ్లిన భర్తను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌లో జీడిమెట్లకు చెందిన మందుగుల సురేష్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ చెందిన యువతిని 2020 ఆగస్టు 6న పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరగిన రెండు వారాల తరువాత సురేష్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతడు ఆస్ట్రేలియాకు వెళ్లిన తరువాత యువతిని అత్తింటివారు వేధింపులకు గురి చేశారు. ఆస్ట్రేలియాకు తీసుకెళ్లాలని భార్య బతిమిలాడిని అతడు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్థానిక సిఐ రాజశేఖర్ గౌడ్ ఆస్ట్రేలియాలో ఉన్న భారత ఎంబసీకి సమాచారం ఇచ్చారు. సురేష్ పని చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి భారత ఎంబసీ అధికారులు మెయిల్ పెట్టడంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. సురేష్ భారత్‌కు వచ్చేలా ఒత్తడి పెంచడంతో పాటు ఢిల్లీలో దిగగానే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పెళ్లి చేసుకున్నాడు… ఆస్ట్రేలియాకు పారిపోయాడు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -