చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. 263/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 180 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 555 పరుగుల చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టు తొలి రెండు రోజులు భారత్ పై పూర్తి ఆధిపత్యం సాధించింది. తన కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ జోరూట్(218) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా రూట్ రికార్డు నెలకోల్పాడు. రూట్ తోపాటు ఓపెనర్ సిబ్లీ(87), బెన్ స్టోక్స్(82)లు భారీ అర్థ శతకాలతో రాణించారు. దీంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో డొమినిక్ బెస్(28), జాక్ లిచ్(6)లు ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, ఇశాంత్, అశ్విన్, నదీమ్ లు తలో రెండు వికెట్లు తీశారు.
England 555/8 at stumps on Day 2 against India