Friday, November 15, 2024

కైల్ మేయెర్ డబుల్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

Kyle Mayers debut double century

 

బంగ్లాదేశ్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం

అరంగేట్రం టెస్టులోనే ద్విశతకం చేసిన ఐదో ఆటగాడిగా కైల్ రికార్డు

చతోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన విండీస్ బ్యాట్స్‌మన్ కైల్ మేయెర్ తొలి మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే క్రమంలో పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. మేయెర్స్ అద్భుత ఇన్నింగ్‌తో బంగ్లాదేశ్ నిర్దేశించిన 395 పరుగుల విజయ లక్షాన్ని వెస్టిండీస్ మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తొలుత 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న విండీస్‌ను మేయెర్స్ గొప్ప ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఎన్‌క్రుమా బోనెర్‌తో కలిసి జట్టు భారాన్ని తన భుజస్కందాలపై వేసుకున్నాడు.

ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. నాలుగో వికెట్‌కు 216 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే 178 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న మేయెర్స్ 303 బంతుల్లో ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తం 310 బంతులు ఎదుర్కొన్న కైల్..20 ఫోర్లు, 7 సిక్పర్లతో 210 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఎన్‌క్రుమా బోనెర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. 395 పరుగుల విజయ లక్షాన్ని అందుకున్న విండీస్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇది అయిదో అత్యధిక పరుగుల ఛేదన. భారీ పరుగుల విజయ లక్షాన్ని ఛేదించడం వెస్టిండీస్‌కు రెండో సారి. అంతేకాదు ఇంతటి భారీ స్కోరును ఛేదించడం ఆసియాలోనే తొలిసారి.

ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే ద్విశతకం చేసిన అటగాళ్లలో మేయెర్ అయిదో వాడు. వెస్టిండీస్ ఆటగాళ్లలో రెండో వాడు. ఇంతకు ముందు గ్రీనిడ్జ్ అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. కాగా టెస్టు మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన వారిలో ఆరోస్థానం దక్కించుకున్నాడు. అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు చేసిన ఐదో ఆటగాడిగా నిలచాడు. ఇంతకు ముందు 1903లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఆటగాడు టిఫ్ ఫోస్టెర్ 287 పరుగులు చేసి తొలి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 223 పరుగులు చేసి డిక్లేర్ చేసి విండీస్ ముందు 395 పరుగుల విజయ లక్షాన్ని ఉంచింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే అలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 395 పరుగుల విజయ లక్షాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించి చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News