Saturday, November 16, 2024

మఠంపల్లి కేసులో 21మంది బిజెపి నేతలపై ఎన్‌బిడబ్ల్యు కేసులు

- Advertisement -
- Advertisement -

NBW case against 21 BJP leaders in Mattampally case

 

మన తెలంగాణ/హైదరాబాద్(మఠంపల్లి) : నల్గొంద జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలోని పోలీసులపై దాడులు చేసిన 21 మంది బిజెపి నేతలపై సోమవారం నాడు పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు కేసు న మోదు చేశారు. ఈక్రమంలో సూర్యాపేట జిల్లా భాజపా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డిని కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడ బై పాస్ వద్ద భాగ్యరెడ్డి టీ తాగితున్న సమయంలో పోలీసులు బొబ్బ భాగ్యరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉ న్న పలువురు బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోదాడకు చెందిన బిజెపి రాష్ట్ర నాయకుడు ఓర్సు వేలంగిరాజును సైతం పోలీసులు అదుపులో తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈసందర్బంగా ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆదివారం జరిగిన గిరిజన యాత్రలో పోలీసులపై దాడులు చేయడంతో 21మంది బిజెపి నేతలు, కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశామని వీరిలో 6గురిని అరెస్ట్ చేసి కోదాడ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిపై సెక్షన్ 143,144,147,148,332,333,ఆర్ డబ్లూ 149ఐపిసి,7(1)(ఎ),సిఎల్‌ఎ 1932సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News