చెన్నై: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసింది. 227 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఐదు రోజు భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలంకావడంతో ఇంగ్లాండ్ విజయకేతనం ఎగరేసింది. జాన్ లీచ్, అండర్సన్ బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్ మెన్లు కుప్పకూలిపోయారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడు హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. భారత్ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ(72), శుభ్మన్ గిల్(50), ఛటేశ్వరా పుజారా(15), రిషబ్ పంత్(11), రోహిత్ శర్మ(12), రవీచంద్రన్ అశ్వన్ (09), బుమ్రా (04) పరుగులు చేసి ఔటయ్యారు. వాషింగ్టన్ సుందర్, అజింక్య రహానే, నాదీమ్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో ఔటయ్యారు. ఇషాంత్ శర్మ (05) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ నాలుగు వికెట్లు పడగొట్టగా అండర్సన్ మూడు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్, బెన్ స్టోక్స్ తలో ఒక వికెట్ తీశారు.
చెన్నై టెస్టు ఇంగ్లాండ్దే
- Advertisement -
- Advertisement -
- Advertisement -