Saturday, November 16, 2024

హిందూ ఆలయాన్ని పునర్ నిర్మించాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

Pakistan Supreme Court orders rebuilding of Hindu temple

 

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ధ్వంసమైన హిందూ ఆలయం పునర్‌నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖైబర్‌ఫక్తూన్‌ఖ్వా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆదేశాలిచ్చింది. నిర్మాణం విషయంలో కాలవ్యవధితో కూడిన నివేదికను సమర్పించాలని సూచించింది. గతేడాది డిసెంబర్‌లో కారక్ జిల్లాలోని వందేళ్లనాటి పురాతన హిందూ దేవాలయాన్ని ఉగ్రసంస్థ జమైతే ఉలేమాఎఇస్లాంకు చెందిన దుండగులు తగులబెట్టారు. ఈ సంఘటనను ఆ దేశంలోని మానవ హక్కుల సంఘాలు, హిందూ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. జరిగిన ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీకోర్టు విచారణ చేపట్టి పునర్‌నిర్మాణానికి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News