- Advertisement -
జకార్తా: ఇండోనేషియాకు చెందిన శ్రీవిజయా ఎయిర్ జెట్ గత నెలలో జావా సముద్రంలో కూలిపోవడానికి విమానానికి చెందిన ఆటోమేటిక్ థ్రాటల్ పనిచేయకపోవడమే కారణమని దర్యాప్తుదారులు బుధవారం తెలిపారు. జనవరి 9న జకార్తా నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాలకే విమానం సముద్రంలో కూలిపోయి 62 మంది మరణించిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానానికి చెందిన ఎడమ ఇంజన్ థ్రాటల్ లివర్ చెడిపోయిందని, దీంతో పైలట్లు విమానంపై కంట్రోల్ కోల్పోవడంతో విమానం జావా సముద్రంలో కూలిపోయి ఉంటుందని పేర్కొంటూ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ అధికారులు బుధవారం ఇండోనేషియా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు. 26 ఏళ్లుగా సేవలు అందిస్తున్న ఈ విమానంలోని ఆటోమేటిక్ థ్రాటల్ సిస్టమ్‌లో ఇబ్బందులు తలెత్తాయని గతంలో ఈ విమానాన్ని నడిపిన పైలట్లు చెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు.
- Advertisement -