- Advertisement -
కాబూల్ : కాబూల్ పోలీస్లను లక్ష్యం చేసుకుని వరుసగా జరిగిన బాంబుదాడుల్లో బుధవారం జిల్లా పోలీస్ అధికారి, అతని అంగరక్షకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లకు తాము బాధ్యులమంటూ ఎవరూ ఇంతవరకు ప్రకటించ లేదు. వాహనాలకు అమర్చిన టైమ్ బాంబులను రిమోట్ కంట్రోలుతో పేల్చడంతో ఈ దాడులు జరిగాయి. పశ్చిమకాబూల్ ప్రాంతంలో పోలీస్ కారుకు అమర్చిన టైమ్ బాంబు పేలి కారు చాలా ఎత్తుకు ఎగిరి కిందపడి తుక్కు అయింది. ఈ సంఘటనలో సిటీ జిల్లా 5 పోలీస్ చీఫ్ మొహమ్మద్ జాయ్ కొచి, అతని అంగరక్షకుడు చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ బాంబు దాడికి గంట ముందు రెండు బాంబుదాడులు జరిగాయని కాబూల్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ రెండు దాడుల్లో ఒక సంఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారని, మరో దాడిలో ఎవరూ గాయపడలేదని చెప్పారు.
- Advertisement -