Tuesday, November 19, 2024

ఎత్తిపోతలు ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడగం

- Advertisement -
- Advertisement -

ఎత్తిపోతలు ఏడాదిన్నరలోగా పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లడగం

కృష్ణ, గోదావరులను కలిపి రైతులు కాళ్లు కడుగుతా

నల్లగొండ ఆయకట్టుకు శాశ్వతంగా నీళ్లు అందిస్తాం. జిల్లాలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలను సంవత్సరన్నర వ్యవధిలోగా నిర్మాణ పనులను పూర్తి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడగమం. త్వరలోనే పెద్దదేవులపల్లికి నీళ్లు ఇస్తాం. కృష్ణ, గోదావరి అనుసంధానం చేసి రైతులు కాళ్లు కడుగుతా. నల్గొండ జిల్లాను గతంలో ఎవరూ పట్టించుకోలేదు. గత పాలకులు పట్టించుకోనందున జిల్లా చాలా నష్టపోయింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2,500 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టింది.

మనతెలంగాణ/హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిర్మించనున్న నెల్లికల్లు ఎత్తిపోతల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. నెల్లికల్లులో ఒకేచోట పలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ శంకుస్థాపన చేశారు. ఇందులో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఎల్‌ఎల్‌సి పంప్ హౌస్ నుంచి హెచ్‌ఎల్‌సి 8, 9 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి సరఫరాకు మరమ్మతుల పనులు, దేవరకొండ నియోజకవర్గ పరిధిలో, పొగిల్ల ఎత్తిపోతల, కంబాల పల్లి ఎత్తిపోతల, సంబాపురం పెద్దగట్టు ఎత్తిపోతల, పెద్ద మునగాల ఎత్తిపోతల, ఎకెబిఆర్ ఎత్తిపోతల పథకం, మిర్యాలగూడ నియోజక వర్గంలోని దున్నపోతుల గండి, బాల్లే పల్లి చాప్లాతాండా ఎత్తిపోతల, కేశవాపురం కొండ్రా పోల్, కేశవాపురం కొండ్రాపోల్, బొత్తల పాలెం వాడపల్లి ఎత్తిపోతల, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలోని నాగార్జున సాగర్ ఎడమకాల్వ లైనింగ్ 1.8 కి.మీ నుంచి 70.52 కి.మీ. సిసి లైనింగ్ కోసం హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలో ముక్త్యాల బ్యాంచ్‌కు ఎత్తిపోతల, జాన్ పహాడ్ బ్రాంచ్‌కు ఎత్తిపోతల, జాన్ పహాడ్ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటరీ సిసి లైనింగ్, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, ఇతర ట్యాంకులుకు సిసి లైనింగ్, అధునీకరణ, సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ పరిధిలోని సాగర్ ఎడమ కాల్వ 70.52 కి.మీ నుంచి 115.4 కి.మీ వరకు సిసి లైనింగ్ అభివృద్ది పనులకు సంబందించిన శంఖుస్థాపనలు సిఎం ఒకే చోట చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పనులకు సంబంధించిన వివరాలను సిఎం కెసిఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, శానసమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, రైతుబంధు సమితి ఛైర్మన్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంఎల్‌సి తేరా చిన్పపరెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, రామచంద్రనాయక్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఇరిగేషన్ శాఖ నల్గొండ సిఇ నర్సింహ్మా, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. శంఖుస్థాపన పూజ కార్యక్రమాల సందర్భంగా స్థానిక బంజారాల సాంస్కృతిక ఆచారం ప్రకారం శుభకార్యాల సందర్భంగా తొడిగే కరోబార్ కంకణాన్ని స్థానిక రంగున్ల బంజారా దేవాలయ పూజారి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముంజేతికి తొడిగారు.

CM KCR Inaugurate to Nellikallu Lift Irrigation Project

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News