అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేశ్‌కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్‌లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్, జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్, డైరెక్టర్ సత్యనారాయణలతో సోమేశ్‌కుమార్ శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెరుగైన త్రాగు నీటి సరఫరా కోసం వినియోగదారుల పిటిఐఎన్, క్యాన్ నెంబర్ లతో ఆధార్ సీడింగ్‌ను పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు సరఫరా కాని ప్రాంతాలు, మురికి వాడలలో ఉన్న ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని వాటర్ వర్క్ ఎండి. దానకిషోర్‌ను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు మౌళిక వసతులు తో సహ వేగంగా పూర్తి చేయడానికి తగు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ వార్డులలో ట్రీ పార్కులు అభివృద్ధి పరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.