Monday, November 18, 2024

అరకు ఘాట్‌రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా.. 8మంది మృతి

- Advertisement -
- Advertisement -

8 died after tourist bus rammed into Araku Valley

విశాఖపట్నం: విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అర‌కు లోయలో విషాద ఘటన చోటుచేసుకుంది. అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలంలోని ఐదో నెంబర్ మలుపు వద్ద ఓ టూరిస్ట్ బస్సు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8మంది పర్యాటకులు మృతిచెందగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు‌ తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది టాహుహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందినవారు హైదరాబాద్ ‌వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

8 died after tourist bus rammed into Araku Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News